మెగా హీరోల కలయికలో ఓ మల్టీ స్టారర్ మూవీ!

తెలుగు చిత్ర పరిశ్రమ తొలి నాళ్లలో ఎన్టీఆర్ – ఏఎన్నార్, ఎన్టీఆర్ – కృష్ణ.. కామినేషన్లో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. ఇద్దరి హీరోల అభిమానులను అలరించాయి. ఆ తర్వాత ఇద్దరి ఇమేజ్ లకు తగ్గ కథలు దొరక్క పోవడంతో అటువంటి ప్రయోగాలు చేయడానికి స్టార్ హీరోలు వెనుకడుగువేశారు. టాలీవుడ్ లో ఐదేళ్ల నుంచి మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాల జోరు మొదలయింది. వెంకటేష్- మహేష్, వెంకటేష్ – పవన్, ఇలా ఇద్దరు హీరోలు స్క్రీన్ ని పంచుకోవడం మొదలెట్టారు. దీంతో యువ హీరోలు సైతం ఆ బాటలో నడవడానికి సిద్ధమయ్యారు.

దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతిభతో మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీని ఒకే ప్రేమ్ లో చూపించడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్, చరణ్ తో ఓ మల్టీ స్టారర్ సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే నితిన్, శర్వానంద్ లు కలిసి ఓ చిత్రం చేయబోతున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్ – వరుణ్ తేజ్ లతో మల్టీ స్టారర్ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. బడా నిర్మాతలు ఈ కాంబో సెట్ కావడానికి అవసరమైన కథను వెతికే పనిలో ఉన్నట్టు తెలిసింది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా వరుణ్, సాయి లకు సూటయ్యే కథను అందించగలిగే వారికి నిర్మాతలు ఆహ్వానం పలుకుతున్నారు. మరి ఆ మెగా ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus