Samantha: సమంత వెంటపడుతున్న మరో బడా ఓటీటీ సంస్థ

Advertisement

నటన వైవు అడుగు పెట్టిన తరువాత ఈ రోజుల్లో పర్ఫెక్ట్ యాక్టర్ గా నిరూపించుకోవడం అంటే అంత సాదారణ విషయం కాదు. టాలెంట్ ను బయటపెట్టుకునే పాత్రలో ఎప్పుడో ఒకసారి గాని రావు. ఇక సమంత కెరీర్ మొదట్లో రొటీన్ కమర్షియల్ సినిమాలు ఏ రేంజ్ లో చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఎదో గ్లామర్ రోల్ కోసం అన్నట్లుగా కనిపించేది.

అప్పట్లో అలాంటి పాత్రలను చెయవద్దని సమంతకు చాలా రిక్వెస్టులు వచ్చాయి. జెస్సి కూడా మెల్లగా ఆ ఫార్మాట్ నుంచి బయటపడుతూ వచ్చింది. ఇక ఎప్పుడైతే అక్కినేని వారి కోడలిగా మారిందో అప్పటి నుంచి కూడా ఆమె వేస్తున్న అడుగులు ఊహించని రేంజ్ లో ఉంటున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో రాజీ అనే బోల్డ్ పాత్రలో నటించి అందరికి షాక్ ఇచ్చింది.

ప్రస్తుతం ఆమెకు స్టార్ హీరోయిన్స్ కంటే హై రేంజ్ లో డిమాండ్ పెరిగింది. దీంతో మరోవైపు నెట్ ఫ్లిక్స్ కూడా సమంత కోసం ఒక వెబ్ కంటెంట్ ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. సమంత ఒప్పుకుంటే ఆమెకు అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. సాధారణంగా నెట్ ఫ్లిక్స్ ఒక్కసారి ఫిక్స్ అయితే బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. కంటెంట్ బావుంది అంటే పాత్రకు సెట్టయ్యే యాక్టర్స్ కోసం ఎంత ఖర్చయినా చేస్తారు. ఇక సమంతపై కూడా వారు గట్టి నమ్మకంతో ఉన్నారట. ఇక సమంత ఇప్పటివరకు ఆయుతే నెట్ ఫ్లిక్స్ ఆఫర్ పై ఏ విధంగా క్లారిటీ ఇవ్వలేదు. మరి ఆ ఆఫర్ కు గ్రీన్ సైన్ ఇస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus