విదేశీ కలక్షన్స్ లో రికార్డు నెలకొల్పిన బాహుబలి కంక్లూజన్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ మూవీ తీశారు. భారతీయ వెండితెరపై ఓ మరిచిపోలేని అద్భుత కళాఖండాన్ని ‘బాహుబలి కంక్లూజన్’ పేరిట లిఖించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. వెయ్యికోట్ల  మైలురాయిని పదిరోజుల్లోనే దాటినా సినిమాగా చరిత్ర కెక్కిన ఈ సినిమా టోటల్ రన్ లో 1800 కోట్ల వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. బాక్సాఫీస్‌ ఇండియా తాజా రిపోర్టు ప్రకారం బాహుబలి-2 విదేశాల్లో 801 కోట్లు వసూలు చేసింది. ఇది ఏ భారతీయ చిత్రం ఇప్పటివరకూ చేరుకోలేని రికార్డు.

ఈ రికార్డును స్వయంగా బాహుబలి 2 త్వరలోనే బద్దలు కొట్టనుంది. ఎందుకంటే ఈ సినిమా చైనాలో 4000 తెరలపై రిలీజ్ కానుంది. ఈ మూవీ సులభంగా అక్కడ 200  కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. సో విదేశాల్లో వెయ్యికోట్లు కలక్షన్స్ రాబట్టిన మూవీగా బాహుబలి 2 త్వరలో రికార్డు నెలకొల్పుతుందని భావిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus