MAA elections: ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న ప్రముఖ నటుడు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి రోజుకో ఆసక్తికర మలుపు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు కానీ ఎన్నికల తరువాత కూడా అభ్యర్థుల మధ్య విమర్శలు కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఐదుగురు సెలబ్రిటీలు పోటీ చేస్తున్నట్టు ప్రకటించగా తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ప్రకటన చేశారు. నాకు సినిమాల ద్వారా వచ్చే డబ్బులు తప్ప వేరే ఆదాయం లేదని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు.

కొంతమంది తనను కోటీశ్వరుడు అనుకుంటున్నారని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు. మనిషి లేని వాడు పేదవాడు అని శివాజీ రాజా తాను బావా బావమరుదులమని తమ మధ్య గ్యాప్ ఉంటే మంచిదని కాదంబరి కిరణ్ పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను ఖచ్చితంగా గెలుస్తానని కాదంబరి కిరణ్ కామెంట్లు చేశారు. ‘మా ‘ ఎన్నికల్లో ఓటు వేయడానికి 415 మంది మాత్రమే వస్తారని ఆ ఓట్లలో 300కు పైగా ఓట్లు తనకే పడతాయని కాదంబరి కిరణ్ వెల్లడించారు.

ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాను చెప్పడం లేదని ఎన్నిక జరిగిన తర్వాత ఆ విషయం మీరే ఒప్పుకుంటారని కాదంబరి కిరణ్ కామెంట్లు చేశారు. మా అధ్యక్ష పదవికి గెలవడం కష్టం కాదని కాదంబరి కిరణ్ చెప్పుకొచ్చారు. ఎన్ని ఓట్లు పొల్ అయినా తనకు 300 ఓట్లు గ్యారంటీ అని కాదంబరి కిరణ్ కామెంట్లు చేశారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus