Balakrishna: బాలకృష్ణకి మైనర్ సర్జరీ… టెన్షన్ లో ఫ్యాన్స్..!

  • April 26, 2022 / 08:51 AM IST

అన్ స్టాపబుల్ ఒకటి రెండు ఎపిసోడ్ లు అయ్యాక బాలకృష్ణ తన భుజానికి సర్జరీ చేయించుకున్నారు.అఖండ షూటింగ్ టైంలో జరిగిన చిన్న ప్రమాదంలో గాయపడ్డ బాలయ్య… వెంటనే సర్జరీ చేయించుకోలేదు.ఆ పాట చిత్రీకరణ పూర్తయ్యాక అది కూడా ఆహా వారి కోసం అన్ స్టాపబుల్ ఒకటి రెండు ఎపిసోడ్ లు ఫినిష్ చేశాక సర్జరీ చేయించుకున్నారు. ఆ టాక్ షో కూడా ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Click Here To Watch NOW

అయితే తాజాగా ఆయన మరోసారి సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే…బాలయ్య గత కొన్ని రోజుల నుండి మోకాలి నొప్పితో బాధపడుతున్నారట, దీంతో మరోసారి వైద్యనిపుణులు ఆయనకు శస్త్రచికిత్స అవసరమని చెప్పారట.వైద్యుల మాట విని వెంటనే బాలయ్య తన మోకాలికి సర్జరీ చేయించుకున్నారు అని తెలుస్తుంది. బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీనే, ఆయన ఆరోగ్యం కూడా బాగానే ఉంది, కొద్దిరోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కాబట్టి, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు.

కేర్ హాస్పిటల్‌లో బాలయ్య సర్జరీ చేయించుకోవడం జరిగింది. ఆయన వైద్యులతో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మరోపక్క బాలయ్య అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని పూజలు వంటివి చేస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus