పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి చెప్పిన అను ఇమ్యానుయేల్

స్టార్ హీరోలు వయా యువ హీరోలు… అనే మాదిరిగా అను ఇమ్యానుయేల్ అతి తక్కువ కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ డైరక్టర్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పనిచేసే ఛాన్స్ అందుకుంది. కీర్తి సురేష్ తో కలిసి అను నటించిన సినిమా అజ్ఞాతవాసి కొన్ని గంటల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె.. పవన్, త్రివిక్రమ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. “పవన్ మంచి వ్యక్తి. సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతారు.

అంతేకాదు చాలా సరదాగా కూడా ఉంటారు. ఆయన సెట్ మొత్తాన్ని సంతోషంగా ఉండేలా చేస్తుంటారు. మంచి మనసున్న హీరోతో వర్క్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది” అని అను తన ఆనందాన్ని బయటపెట్టింది. త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో అజ్ఞాతవాసి చేసినందుకు చాలా కొత్తగా అనిపించింది. ఆయనది చాలా డిఫెరెంట్ టేకింగ్. కేవలం సినిమా మాత్రమే కాదు భారతీయ చరిత్ర నుంచి భౌతిక శాస్త్రం వరకు… అన్ని విషయాలపై ఆయనకున్న పరిజ్ఞానం అమోఘం. త్రివిక్రమ్ గారి నుంచి కొత్త విషయాలను ఎన్నో నేర్చుకున్నాను. ఆయన నుంచి నేర్చుకునేది ఇంకా చాలా ఉంది” అని అను ప్రశంసలు గుప్పించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus