రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్ల పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన చిత్రం ‘అనుభవించు రాజా’. నవంబర్ 26న నిన్న విడుదలైన ఈ చిత్రానికి పర్వాలేదనిపించే టాక్ నమోదయ్యింది.గత రెండు వారాలుగా కాస్త పెద్ద సినిమా ఏదీ రాకపోవడంతో.. ఆడియెన్స్ కు ‘అనుభవించు రాజా’ వీకెండ్ టార్గెట్ అవుతుందని నిన్నటి ఓపెనింగ్స్ తో స్పష్టమవుతుంది.
తొలిరోజు ఓపెనింగ్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం
0.27 cr
సీడెడ్
0.16 cr
ఆంధ్రా(టోటల్)
0.32 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
0.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.04 cr
ఓవర్సీస్
0.03 cr
వరల్డ్ వైడ్ టోటల్
0.82 cr
‘అనుభవించు రాజా’ చిత్రానికి రూ.3.90 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.సో బ్రేక్ ఈవెన్ కు రూ.4 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజు ఈ చిత్రం రూ.0.82 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి ఎంత వరకు రాబడుతుందో చూడాలి..! రెండో రోజు నుండీ మరింత గ్రోత్ చూపించి.. వీకెండ్ భారీగా రాబడితే బ్రేక్ ఈవెన్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.మరి ఆ అవకాశాన్ని ఈ రాజా ఎంత వరకు అనుభవిస్తాడో చూడాలి..!