‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ట్రైలర్ రివ్యూ..!

ఇటీవల యువ వెటర్నరీ డాక్టర్ అయిన దిశ ఇన్సిడెంట్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నలుగురు యువకుల అతి క్రూరంగా ఆమె పై అత్యాచారం చేసి.. ఆ తరువాత ఆమెను సజీవ దహనం చేశారు. దీంతో అలాంటి క్రూర మృగాల్ని వెంటనే చంపెయ్యాలి అంటూ ఎన్ని నిరసనలు జరిగాయి. వారనుకున్నట్టే.. పోలీసులు ఎంకౌంటర్ కూడా చేశారు. దీంతో చాలా వరకూ ప్రజలు సంతోషించినప్పటికీ ఇదే పెద్ద నాయకుల కొడుకులు అయితే ఇలాగే శిక్షిస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ కామెంట్లు వినిపించాయి. ఇది పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు అన్నీ సినిమాల వల్లే జరుగుతున్నాయి అని ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. అయితే సినిమాల ద్వారా మంచి మెసేజ్ లు కూడా ఇస్తున్నారు అవెందుకు యువతని ప్రేరేపించడం లేదు అని మరికొంత మంది వాదిస్తున్నారు. ఇలాంటి రచ్చ జరుగుతున్న తరుణంలో.. తాజాగా ఓ ట్రైలర్ విడుదలయ్యింది. అదే ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ సినిమా ట్రైలర్.

ధన్య బాలకృష్ణ, కోమలి, సిద్ది, త్రిదా వంటి నలుగురు హీరోయిన్లు నటించిన ఈ చిత్రాన్ని బాలు అడుసుమిల్లి డైరెక్ట్ చేశాడు. ‘బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్’ మరియు ‘పూర్వి పిక్చర్స్’ బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందింది. ట్రైలర్ విషయానికి వస్తే నలుగురు యువతులు… విభిన్న అభిప్రాయాలు కలిగిన వీరు ఎంజాయ్ చేయడానికి గోవా వెళ్తారు. అక్కడ వారు ఓ ‘కాల్ బాయ్’ ను బుక్ చేసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. కానీ అనూహ్యంగా ఓ హత్య చేస్తారు. అందులో నుండీ ఎలా బయట పడ్డారు అనేది మిగిలిన కథ.


24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ అండ్ లైక్స్ సాధించిన లిరికల్ సాంగ్స్ ఇవే!
30 సౌత్ ఇండియన్ హీరోయిన్లు మరియు వారి చైల్డ్ హుడ్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus