Anupama: ఎంత ఇబ్బందో మాకు మాత్రమే తెలుసన్న అనుపమ.. ఈజీ కాదంటూ?

ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్ కానున్న సినిమాలలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ (Tillu Square)  మూవీ ముందువరసలో ఉంటుంది. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ (Anupama Parameswaran) కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అనుపమ ఈ సినిమాలో గ్లామరస్ గా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. అయితే గ్లామర్ షో గురించి అనుపమ మరోసారి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిల్వర్ స్క్రీన్ పై ఒక అమ్మాయి హాట్ గా కనిపించడం ఎంత కష్టమో టిల్లు స్క్వేర్ సినిమాతో నాకు అర్థమైందని అనుపమ తెలిపారు.

సినిమా చూసే వాళ్లందరూ గ్లామర్ రోల్స్ చేస్తుందని సింపుల్ గా కామెంట్ చేస్తారని ఆమె వెల్లడించారు. అలాంటి రోల్స్ చేయడం చాలా ఇబ్బంది అని అనుపమ పేర్కొన్నారు. కొన్ని కాస్ట్యూమ్స్ స్క్రీన్ పై చూడటానికి చాలా కలర్ ఫుల్ గా కనిపిస్తాయని ఆమె వెల్లడించారు. ఆ కాస్ట్యూమ్స్ వేసుకుని సెట్ లో ఎక్కువమంది ఎదురుగా నిలబడాలంటే ఉండే కష్టం మాకు మాత్రమే తెలుస్తుందని అనుపమ అన్నారు. మరికొన్ని కాస్ట్యూమ్స్ కు అద్దాలతో చేసిన వర్క్ ఉంటుందని అవి గీసుకుపోతాయని ఆమె తెలిపారు.

ఇవన్నీ భరిస్తే మాత్రమే గ్లామర్ గా కనిపిస్తారని అనుపమ పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులు పడుతూ యాక్ట్ చేస్తున్న నటీమణులను మెచ్చుకోవాలని ఆమె అన్నారు. టిల్లు స్క్వేర్ సినిమా నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానని అనుపమ పేర్కొన్నారు. ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుందని అనుపమ కామెంట్లు చేశారు.

అనుపమ పరమేశ్వరన్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టిల్లు స్క్వేర్ మూవీకి బుకింగ్స్ భారీ స్థాయిలో ఉండగా ఈ సినిమాకు కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. బిజినెస్ పరంగా మాత్రం ఈ సినిమా అదరగొట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus