Anupama: చెప్పి మరీ వాళ్ల పరువు తీసిన అనుపమ… ఏం చేసిందంటే?

టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్‌ చాలా డిఫరెంట్‌ అని అంటుంటారు. తొలినాళ్లలో స్కిన్‌ షో అంటే ఆమడ దూరం జరిగిన అనుపమ… ఇప్పుడు ఏకంగా లిప్‌ లాక్‌లకు, స్కిన్‌ షో, పొట్టి బట్టలకు… ఇంకా కాస్త ముందుకు జరుగుతోంది. కెరీర్‌తోపాటు, ఇండస్ట్రీతోపాటు, పరిస్థితులతోపాటు ముందుకు వెళ్తూ వచ్చింది. ఇప్పడు ‘టిల్లు స్క్వేర్‌’లో పైన చెప్పినవన్నీ చేసింది అని టీజర్‌ చూస్తే చెప్పేయొచ్చు. రీసెంట్‌గా వచ్చిన సినిమా చాలా స్ట్రాంగ్‌ పాత్రల్లో కనిపించింది. మాటకు మాటలు అనడంతో నిజ జీవితంలో చాలా స్ట్రాంగ్‌.

ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్‌ ఉందా? అయితే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ చూడండి మీకే అర్థమైపోతుంది. ఓ వెబ్‌సైట్‌ వాళ్లను కడిగిపారేసింది. ‘అనుపమతో మామూలుగా ఉండదు’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఫ్యాన్స్‌ అయితే ‘అనుపమ అల్లాడించేసింది’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే… ఆమె కొత్త సినిమా ‘సైరెన్’పై ఓ వెబ్ సైట్ రివ్యూ రాసింది. అందులో ఆమెకు డైలాగ్స్ లేవు అని రాశారు. మామూలుగా అయితే పెద్ద విషయం కాదు. కానీ ఆ సినిమాలో ఆమె మూగ, చెవుడు పాత్ర పోషించింది.

దీంతో ఆ రివ్యూపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు తిరిగి ఇటు తిరిగి ఆ రివ్యూ అనుపమ వద్దకు వెళ్లింది. దీంతో ఆమె వాళ్లతోనే ఇన్‌స్టాగ్రామ్‌ మెసేజ్‌ ద్వారా మాట్లాడింది. ఆ తర్వాత ఆ చాట్‌ను తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. ఇలా బేస్ లెస్ వార్తలు రాస్తారు అంటూ ప్రశ్నించిన ఆమె… ఈ విషయం అందరికీ తెలియాలి కదా అని ఇలా స్టోరీస్‌లో పెట్టాను అని చెప్పింది.

‘‘అనుపమ (Anupama) ఇటీవల రెండు చిత్రాల్లో కనిపించిందని, ‘ఈగల్’ సినిమాలో సైడ్ రోల్ చేయగా, రెండో సినిమా ‘సైరెన్’లో కొన్ని సీన్లకు పరిమతం అయింది. అసలు డైలాగ్స్ కూడా లేవు’’ అని రాసుకొచ్చారు ఆ రివ్యూలో. దీంతో ‘‘ఓ మూగ, చెవిటి పాత్ర నుండి మాటలు, డైలాగ్స్ ఆశిస్తున్నారా? గ్రేట్’’ అంటూ కౌంటర్లు వేసింది అనుపమ. దీనికి ఆ వెబ్ సైట్ స్పందించింది. ఎడిట్ చేయిస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఇలా రాయడమే సరికాదు అంటూ ఆ విషయాన్ని స్టోరీస్‌లో పెట్టింది.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus