Anupama: ప్రతిరోజు ఉదయం ఇలాగే మొదలవుతుందంటూ చిరాకు పడిన అనుపమ?

Advertisement

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు సినిమాలలో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈమె పలు సినిమా షూటింగులతో బిజీగా ఉండటమే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా,

పలు అంశాలపై కూడా ప్రస్తావిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అభిమానులతో సరదాగా ముచ్చటించే ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ తీవ్రస్థాయిలో నెటిజన్ల పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈమె ఇంతగా అసహనం వ్యక్తం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని మన ఇంటి చుట్టూ,

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విధంగా అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ప్రభుత్వాలు నెత్తిన నోరు పెట్టుకొని చెప్పినప్పటికీ మనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలోనే రోడ్లపై చెత్త కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి, ఆ దారిన వెళ్ళే వారికి ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది.

ఇలా రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్తను అధికంగా వేయటం వల్ల ఎన్నో మూగజీవాలు ప్లాస్టిక్ తింటూ ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఎన్నో చూసాము. తాజాగా ఇలాంటి ఫోటోని అనుపమ షేర్ చేస్తూ.. నాకు ప్రతిరోజూ ఉదయం ఇలాగే మొదలవుతుంది. ఇప్పటికీ భూమిపై ఇలా చేసే వారిని చూస్తుంటే చాలా సిగ్గుగా ఉంది… సేవ్ ఎర్త్.. సేవ్ ప్లానెట్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనుపమ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus