మీ టూ (నేను కూడా).. ఈ పదం సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తోంది. అమ్మాయిలు వేధింపులకు గురయితే చెప్పుకోవడానికి వెనుకాడుతుంటారు. అదే అబ్బాయిలకు బలం. అందుకే ఆ విషయాన్నీ ఇతరులకు చెప్పుకోవాలని అవగాహన కల్పించేందుకు కొంతమంది ఆడవాళ్లు కలిసి సోషల్ మీడియాలో ఈ పదాన్ని ప్రవేశపెట్టారు. దీనికి విశేష స్పందన వస్తోంది. సామాన్యులతో పాటు ఐశ్వర్య రాయ్ వంటి సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు గురయ్యామని చెబుతున్నారు. ఈ జాబితాలో తాజాగా అనుపమ పరమేశ్వరన్ చేరింది. తాను కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను అని ఆమె చెప్పింది.
“నేను కూడా కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులని ఎదుర్కొన్నాను. అయితే అప్పుడే వాటిని తిప్పి కొట్టాను” అని వివరించింది. “ఆ సమయంలో మగవారికి కలిగే ఆనందం ఏమిటో నాకు తెలియదు. కానీ వారి పనుల వల్ల అమ్మాయిలు చాలా ఇబ్బందిపడతారని అర్ధం చేసుకోవాలి. వారి ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారనే విషయం గుర్తు చేసుకోవాలి” అని అనుపమ వివరించింది. అ..ఆ, ప్రేమమ్, శతమానం భవతి వంటి విజయాలు అందుకున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా “ఉన్నది ఒకటే జిందగీ” తో మరో హిట్ ని తన ఖాతలో వేసుకుంది.