మార్ఫింగ్ ఫోటోలతో సినీ సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం మార్ఫింగ్ ఫోటోలతో కొందరు ఆకతాయిలు చేస్తున్న అసభ్యకరమైన పోస్టులకు చాలా హర్ట్ అయ్యి.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తర్వాత ఆయన పాల్గొన్న ఓ ఈవెంట్లో ఈ విషయంపై ఆయన స్పందించి తన ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీని పాజిటివ్ గా వాడుకునే వాళ్ళకంటే నెగిటివ్ గా వాడుకుని.. చాలా మందిని వేధించడమే కొందరు పనిగా పెట్టుకున్నారని.
అలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా ప్రమాదకరమని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా మార్ఫింగ్ ఫోటోల కారణంగా ఎదుర్కొంటున్న వేధింపులను బయట పెట్టింది. ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్ కావడం.అవును అనుపమ పరమేశ్వరన్ మార్ఫింగ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అనుపమ బాగా హర్ట్ అయ్యింది.
వెంటనే పోలీసులను ఆశ్రయించింది. వారి ఎంక్వైరీలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అదేంటంటే.. ఇప్పటివరకు హీరోయిన్ల ఫోటోలు ఎక్కువగా మార్ఫింగ్ చేసేది అబ్బాయిలు అని అంతా అనుకున్నారు. కానీ అనుపమ ఫోటోలు మార్ఫింగ్ చేసింది ఓ అమ్మాయి. తమిళనాడుకి చెందిన 21 ఏళ్ళ అమ్మాయి అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ.. మానసిక ఆనందం పొందుతుంది.
ఈ విషయం తెలిసి అనుపమ కూడా షాక్ అయినట్టు సమాచారం. ‘ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతుందని, వాటి వల్ల తన ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చింది. అలాగే ఆ అమ్మాయిపై లీగల్ గా కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు కూడా అనుపమ పరమేశ్వరన్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.