పాపం.. చెయ్యని తప్పుకి బలైపోయింది..!

సెలెబ్రిటీలను.. నెటిజెన్ల ట్రోల్ చేయడం సర్వ సాధారణమైన విషయం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పలానా హీరోయిన్ డ్రెస్సింగ్ నుండీ మొదలు పెట్టి.. సినిమాలో హీరోయిన్ పాత్ర నచ్చకపోయినా…తమ అభిమాన హీరోను నెగటివ్ కామెంట్ చేసినా పెద్ద రచ్చ రచ్చ చేస్తుంటారు కొందరు నెటిజన్లు’. ‘ఫ్యాన్స్ కు లాజిక్స్ ఉండవు… ఎమోషన్స్ తప్ప’ ఇది ‘జులాయి’ సినిమాలో బ్రహ్మానందం చెప్పిన మాట. ఇది మన నెటిజెన్లకి కరెక్ట్ గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా కొందరు నెటిజన్లు తప్పు లేకపోయినా అనుపమ పరమేశ్వరన్ ను ట్రోల్ చేసారు.

వివరాల్లోకి వెళితే.. కేరళలో త్రిస్సూర్ కలెక్టర్ గా పనిచేసే టీవీ అనుపమ రీసెంట్ గా ఒక బీజేపీ అభ్యర్థిపై ‘శబరిమల’ కు సంబంధించిన ఎలెక్షన్ కమిషన్ రూల్స్ ను అతిక్రమిస్తున్నాడని కంప్లయింట్ చేసింది. దీంతో చాలామంది నెటిజెన్ల ఆమెను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఆలోచించకుండా… అనుపమ పరమేశ్వరన్ ను కలెక్టర్ అనుపమగా అనుకుని ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇలా తన తప్పు లేకపోయినా అనుపమ ట్రోల్స్ కు గురయ్యింది. ఈ విధంగా నెటిజెన్ల ఎమోషన్ కు లాజిక్ లేకుండా పోతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ట్రోల్స్ పై అనుపమ ఇంకా ఏమీ స్పందించలేదు. ప్రస్తుతం అనుపమ… బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ‘రాక్షసన్’ తమిళ రీమేక్ అయిన ‘రాక్షసుడు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈచిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ ను అనుపమ తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ పోస్ట్ పైనే భయంకరమైన కామెంట్లతో అనుపమని ట్రోల్ చేసారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus