అనవసరంగా అనుపమను ఆడిపోసుకొంటున్నారు!

ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి సినిమా గురించి ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సినిమా రేంజ్ ని బట్టి ఆ రూమర్ స్ప్రెడ్ అయ్యే రేంజ్ ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఒక్కోసారి ఆ రూమర్స్ ని పట్టించుకోకుండా వదిలేయడమే మంచిదని ఇప్పటికే పలుమార్లు ప్రూవ్ అయ్యింది. పాపం అనుపమకు ఈ విషయం తెలియక ఒక రూమర్ విషయంలో క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నించి అభాసుపాలైంది. ఇటీవల “హలో గురు ప్రేమ కోసమే” అనే సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కు పకాష్ రాజ్ కు నడుమ చిన్న తగాదా జరిగిందని.. ఆ గొడవ కారణంగా ప్రకాష్ రాజ్ సెట్స్ నుంచి వెళ్లిపోయారని, హీరోయిన్ అనుపమ కూడా బాగా అప్సెట్ అవ్వడంతో ఆరోజుకి షూటింగ్ కి స్వస్తిపలికారని కొన్ని పాపులర్ సోషల్ మీడియా ఎకౌంట్స్ తోపాటు కొన్ని వెబ్ సైట్స్ లోనూ వార్తలొచ్చాయి.

ఆ విషయం అబద్ధం అని చెప్పడానికి అనుపమ చేసిన ప్రయత్నమే “దోస్ జోక్స్” అంటూ ప్రకాష్ రాజ్ తో కలిసి తీసుకొన్న సెల్ఫీ పోస్ట్. ఆ పోస్ట్ తో మేమేమీ గొడవ జరగలేదు, ఆ వార్తలన్నీ జోకులు అని పేర్కొంటూ అనుపమ ఇచ్చిన వివరణను ఇప్పుడు కొందరు తప్పుబడుతున్నారు. ఒకవేళ వార్త అబద్ధం అనుకొంటే క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటున్నారు కొందరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus