‘అ!’ మూవీ అందించిన అనుభూతుల్ని పంచుకున్న అనుపమ

  • February 15, 2018 / 12:23 PM IST

‘అ!’ టైటిల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ లుక్ నుంచి ఈ మూవీ సెన్సేషన్ సృష్టిస్తోంది. వరుసగా విజయాలతో హ్యాపీగా ఉన్న నానిని సైతం ఈ కథ నిర్మాతగా మార్చింది. అతను వాల్ పోస్టర్ బ్యానరుని స్థాపించి ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, థీమ్ సాంగ్ భారీ క్రేజ్ ని తెచ్చి పెట్టాయి. నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ రేపు థియేటర్లోకి రానుంది. అయితే ఈ సినిమాని ముందుగానే కొంతమంది సినీతారలు చూసారు.

వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఉన్నారు. ఆమె ఈ సినిమా గురించి మనసులో దాచుకోలేకపోయింది. తన ఫీలింగ్స్ ని బయటికి చెప్పింది. ‘‘అ! సినిమాను చూస్తుంటే భయం, ఆశ్చర్యంతో కూడిన ఓ అద్భుతమైన రెస్పెక్ట్‌ నాకు కలిగింది. నిజంగా ఇన్‌స్పైర్ చేసే విధంగా ఒక కొత్త అప్రోచ్‌తో మంచి వాల్యూస్‌తో ఈ సినిమాను నిర్మించారు.’’ అని అనుపమ ట్వీట్‌ చేసింది. నాని, రవితేజ లు చేప, చెట్టు పాత్రలకు వాయిస్ ఓవర్ ఇచ్చారంటే.. ఈ కథ ఎంత బాగుంటుందో అర్ధమవుతోంది. మరి సినిమా ఇంకెంత బాగుంటుందో కొన్ని గంటల్లో ప్రేక్షకులు చూసి తెలుసుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus