Anupama, Rajamouli: రాజమౌళి కాళ్ళ పై పడ్డ అనుపమ పరమేశ్వరన్.. వీడియో వైరల్..!

ఆగస్టు నెల టాలీవుడ్ కు ఊపిరి పోసిందనే చెప్పాలి.గత రెండు నెలలుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ను ‘బింబిసార’ ‘సీతా రామం’ చిత్రాలు గట్టెక్కించాయి. ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రానికి కూడా మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. అయితే ఆ సినిమాకి నెగిటివ్ టాక్ రావడం.. పెద్ద దెబ్బ అని చెప్పాలి.అయితే ఈరోజు రిలీజ్ అయిన ‘కార్తికేయ 2’ చిత్రం సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుని దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి వీక్షించారు దర్శకధీరుడు రాజమౌళి.

అక్కడ ఆయనకు అనుకోని అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో హీరోయిన్ ‘కార్తికేయ 2’ హీరోయిన్ అనుపమ ఒక్కసారిగా జక్కన్న కాళ్లకు నమస్కరించడం హాట్ టాపిక్ అయ్యింది. రాజమౌళి అనుపమను అభినందిస్తున్న టైం ఆమె ఇలా చేసినట్లు తెలుస్తుంది. ‘సినిమా బాగుందని, నీ పాత్ర కూడా చాలా బాగుందని రాజమౌళి అనుపమతో చెప్పినట్లు తెలుస్తుంది.ఆ టైంలో ఆమె రాజమౌళి కాళ్ళ పై పడినట్లు తెలుస్తుంది. జక్కన్న పక్కనే కీరవాణిని అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా కౌగిలించుకుంది అనుపమ.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘కార్తికేయ 2’ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించగా.. చందూ మొండేటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ పిక్చర్స్’ సంస్థల పై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదిత్య మీనన్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష వంటి వారు కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus