మహా భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క..!!

అరుంధతి అనుష్క మహా భక్తురాలిగా మెప్పించనుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత చేస్తున్న మరో భక్తి రస కథా చిత్రం “ఓం నమో వెంకటేశాయ”. ఇందులో స్వీటీ కీలక పాత్రలో కనిపించనుంది. హథీ రామ్ బాబాగా కింగ్ నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో అనుష్క వేంకటేశ్వరుని భక్తురాలు కృష్ణమ్మ పాత్రకు ప్రాణం పోస్తోంది.

రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో అనుష్క ఫస్ట్ లుక్ ని శనివారం విడుదల చేశారు. భక్తురాలి గెటప్ అందరికీ చాలా బాగా నచ్చింది. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రలు ఆమెకు ఎంత గుర్తింపును తీసుకొచ్చాయో కృష్ణమ్మ పాత్ర అంతకంటే ఎక్కువ పేరును తీసుకొస్తుందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.

జె.కె. భారవి కథ అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్, శ్రీదేవిగా విమలా రామన్, భూదేవిగా పావని గంగి రెడ్డి నటిస్తున్నారు. గత శనివారం విడుదలైన వీరి ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus