అనుష్క పోలీస్ కాదట!

అనుష్క టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రం భాగ్ మ‌తి. పిల్ల‌జ‌మిందార్ ఫేమ్ జి.అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. యువీ క్రియేష‌న్స్ ఈ సినిమాని తెర‌కెక్కిస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రంలో అనుష్క పోలీస్ గెట‌ప్ లో క‌నిపిస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే నిజ‌మైతే.. అనుష్క పోలీస్ పాత్ర వేసిన తొలి చిత్రం ఇదే అవుతుంది.

దాంతో ఈ సినిమాకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ నెల‌కొనే అవ‌కాశాలున్నాయి. కానీ చిత్ర‌బృందం మాత్రం ”అనుష్క పోలీస్ కాదు. ఇదో థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో అనుష్క పాత్రేమిటి?  ఎలా ఉంటుంది? అనే విష‌యాలు ఇప్పుడే చెప్పం” అని ఊరిస్తున్నాయి. సో.. అనుష్క పోలీస్ అన్న‌ది పుకారే అన్న‌మాట‌. మ‌రి ఈ సినిమాలో అనుష్క పాత్రేమిటో..? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus