Anushka: చివరికి ఆయనే అవకాశం ఇచ్చారు : అనుష్క

కెరియర్లో అందరూ స్టార్ హీరోలతో నటించిన అనుష్క తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పునాది వేసింది. అలా స్టార్ హీరోలతో నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ చాలా కాలం పాటు వెలుగు వెలిగింది. రీసెంట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. తాజాగా అనుష్క తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అనుష్కకు సంబంధించిన పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది. మీకు హీరోయిన్‌గా ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? అని అడగగా..పూరి జగన్నాథ్ వల్ల వచ్చింది. ఇండస్ట్రీ పర్సన్ అయిన నివాస్ వైఫ్, నేను మంచి యోగా ఫ్రెండ్స్. నివాస్ తో పాటు శ్రీను అని ఉండేవారు. ఆయన పూరి జగన్నాథ్ ని కలవమని చెప్పారు. ఒక సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్నారు అని చెప్పి ఫోన్ చేయమని నాతో అన్నారు.

కానీ నాకు చాలా సిగ్గు. శీను నాకు కాల్ చేయమని అన్నారు. కానీ నేను ఆ విషయంలో పూరి జగన్నాథ్ ని చీటింగ్ చేశాను. ఎందుకంటే నేను కాల్ చేయలేదు. ఆ సమయంలో శ్రీను కాల్ చేసావా? అని అడిగితే చేశాను అని చెప్పాను.నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళందరూ నేను తప్పించుకుంటున్నానని అర్థం చేసుకొని వాళ్లే.. నాతో పూరి జగన్నాథ్ కు కాల్ చేయించారు. నిజం చెప్పాలంటే నేను సినిమాలు పెద్దగా చూడను. టీవీ కానీ, మూవీస్ కానీ అలవాటు లేవు.

అప్పుడు పూరి జగన్నాథ్ ని కలిశాను. సో ఒక మూవీ ఉందని చెప్పారు. అప్పుడు ఫోటో ఉందా? అని అడిగారు. దాంతో ఉందని, నా పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చాను. అప్పుడు పూరి ఆ ఫోటో చూసి ఆ తర్వాత నా ఫేస్ చూసి నవ్వారు. ఆ తర్వాత సరే నేను కాల్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే కాల్ చేసి నువ్వు హైదరాబాద్ రావాలి అని అన్నారు. ఆ టైంలో నాకు యోగ క్లాసెస్ ఉన్నాయి. నేను (Anushka) రాను వీలు చూసుకుని వస్తానని చెప్పాను” అని తెలిపింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus