ఇటలీలో కలుసుకున్న ప్రభాస్, అనుష్క

వెండితెరపై సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరుతెచ్చుకున్న పెయిర్ ప్రభాస్, అనుష్క . తెరపైన వారిద్దరీ మధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉంటుంది. అందుకే వారు నిజజీవితంలోనూ ప్రేమికులని, పెళ్లి చేసుకుంటున్నారని రూమర్స్ వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆ గాసిప్స్ ని ఎప్పటికప్పుడూ ఖండిస్తూ.. మంచి స్నేహితులుగా మెలుగుతున్నారు. తాజాగా కలుసుకొని కబుర్లు చెప్పుకున్నారు. హైదరాబాద్ లో అనుకుంటున్నారా? కాదు.. అసలు మనదేశంలోనే కాదు.. ఇటలీలో మీట్ అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాకి బ్రేక్ ఇచ్చి.. రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులుగా ఇటలీలో జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ ఈ నెల వరకు అక్కడే కొనసాగనుంది.

ఆ షూటింగ్ స్పాట్ కి స్వీటీ వెళ్ళింది. అంతదూరం అనుష్క ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడికి వెళ్లి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది?.. అని ప్రశ్నలు గుప్పించకండి. అక్కడికే వస్తున్నాం. అనుష్క సైజ్ జీరో సమయంలోబరువు బాగా పెరిగింది. తగ్గిపోవచ్చు అంటే శరీరం సహకరించలేదు. అందుకే ఇటలీలో సహజమైన పద్ధతుల్లో బరువు తగ్గే వైద్యం లభిస్తుందని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. కాస్త తీరిక దొరగ్గానే ప్రభాస్ షూటింగ్ స్పాట్ కి వెళ్లిందని సమాచారం.. కాసేపు కబుర్లు చెప్పుకున్నారని తెలిసింది. అనుష్క బరువు తగ్గిన తర్వాత మళ్ళీ ప్రభాస్ కి జోడీగా నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus