Anushka: ఆ పాత్ర కోసమే సర్జరీ చేయించుకున్నా : అనుష్క

సినిమా ఇండస్ట్రీలో అందంగా కనిపిస్తే మాత్రమే హీరోయిన్లకు ఆఫర్లు వస్తాయి. కొంతమంది హీరోయిన్లు మరింత అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. అయితే సర్జరీలు చేయించుకున్న విషయాన్ని వెల్లడించడానికి చాలామంది హీరోయిన్లు ఇష్టపడరు. అయితే స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మాత్రం ఒక సందర్భంలో తాను సర్జరీ చేయించుకున్నానని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెదాలకు సర్జరీ చేయించుకున్న అనుష్క శర్మ సర్జరీ విషయంలో దాచడానికి ఏమీ లేదని అన్నారు.

బాంబే వెల్వేట్ అనే సినిమాలో పాత్ర ప్రకారం తన పెదాలు పెద్దగా కనిపించాలని అందువల్లే తాను సర్జరీ చేయించుకున్నానని అనుష్క శర్మ అన్నారు. సర్జరీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని అనిపించిందని అందుకే నిజం చెబుతున్నానని ఆమె అన్నారు. సర్జరీ వల్లే తాను అందంగా కనిపిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అనుష్క శర్మ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంపై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తరువాత అనుష్క శర్మ పెదాలు సహజంగా లేదని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

అనుష్క శర్మతో పాటు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా సర్జరీ చేయించుకున్నారు. ప్రియాంక ముక్కుకు సర్జరీ చేయించుకోగా కొంతమంది నెటిజన్లు ఆమెను ప్లాస్టిక్ ప్రియాంక అంటూ ట్రోల్ చేశారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, కత్రినా కైఫ్, అదితిరావ్ హైదరీ, శిల్పాశెట్టి, మరికొందరు హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నారని ప్రచారం జరగగా ఆ ప్రచారంపై వాళ్లు స్పందించలేదు.

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus