ప్రతి అమ్మాయి జీవితాన్ని రెండు భాగాలుగా చూస్తుంది. పెళ్ళికి ముందు.. పెళ్లి తర్వాత. సినీ తారలు కూడా అంతే. పెళ్లికి ముందు లిప్ కిస్ లు.. హాట్ డ్రస్ లతో అదరగొట్టే హీరోయిన్స్ పెళ్లి తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెడుతారు. ఇతర హీరోలతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడరు. అంతేకాదు హాట్ ఫోజులకి కూడా గుడ్ బై చెప్పేస్తారు. ఇప్పటివరకు ఇలాంటి హీరోయిన్స్ ని ఎంతోమందిని చూసాము. కానీ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు నేటి హీరోయిన్స్. చైతూని పెళ్లి చేసుకున్న తర్వాత సమంత పొట్టి డ్రస్సులకు గుడ్ బై చెబుతుందనుకుంటే.. అటువంటి ఆలోచనకి గుడ్ బై చెప్పింది. క్లివేజ్ కనిపించేలా హాట్ ఫోజులతో ఫోటోలకు ఫోజులిస్తూ పెళ్లి అయితే తగ్గాలా? అనే ప్రశ్నను ఇండైరెక్ట్ గా అడిగింది.
అలాగే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ ని వివాహమాడింది. ఆ తర్వాత డీ గ్లామర్ రోల్ చేసింది. ఇక అనుష్క ఎక్స్ పోజింగ్ కి దూరమయి పోతుందని అనుకున్నారు. కానీ తాజాగా ఓ ఫోటో షూట్ లో అందాలని ఆరబోసింది. హాట్ ఫోజులిచ్చి యువతని పిచ్చెక్కించింది. ఆ స్టిల్స్ చూసిన బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఆశ్చర్యపోతున్నారు. రొమాంటిక్ కథలను అనుష్క చేయరని అనుకున్నాము.. కానీ ఆమె ఇలా నటించడానికి ఒకే అంటే మేము సినిమాలు తీయడానికి సిద్ధమేనని ముందుకువస్తున్నారు. ఈ దెబ్బతో అనేక సినిమాల్లో అనుష్క శర్మ నటించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.