తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. ఈ మధ్య కాలంలో సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. ‘బాహుబలి’ తో ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా.. దాన్ని క్యాష్ చేసుకోవాలని అనుష్క అస్సలు ప్రయత్నించడం లేదు. ‘బాహుబలి2’ తర్వాత అనుష్క ‘భాగమతి’ ‘సైరా నరసింహారెడ్డి’ ‘నిశ్శబ్దం’ వంటి చిత్రాల్లో నటించింది. ఇందులో ‘నిశ్శబ్దం’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల అనుష్క సినిమా థియేటర్లలో చూసి చాలా ఏళ్ళు అయిపోయిందనే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది.
అనుష్క లాక్ డౌన్ లో మళ్ళీ బరువు పెరగడం వల్ల ఆమె సినిమాలు డిలే అవుతూ వచ్చాయి. ప్రస్తుతం అనుష్క…. నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ చెఫ్ పాత్రలో ఈమె కనిపించబోతున్నట్టు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. అనుష్క ఓ వింత సమస్యతో తెగ ఇబ్బంది పడుతుందట. ఆ సమస్య వల్ల ఆమె షూటింగ్ ను ఓ 15 నిమిషాల పాటు ఆపేస్తుందట.
ఇంతకీ అనుష్కని బాధపెడుతున్న ఆ సమస్య ఏంటి? అనుకుంటున్నారా? అదే నవ్వు సమస్య. అవును అనుష్కకి నవ్వు ఆపుకోలేని ఓ చిత్ర విచిత్రమైన సమస్య ఉందట. ఒకసారి నవ్వడం మొదలుపెడితే దాదాపు 15 నిమిషాల పాటు ఆమె నవ్వుతూనే ఉంటుందట. షూటింగ్ ఆపేసి మరీ ఇటూ అటూ తిరుగుతూ నవ్వుతుంటుందట అనుష్క. ఈ విషయాన్ని ఆమెనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక అనుష్క వయసు ఇప్పుడు 41 ఏళ్ళు అన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆమె పెళ్లి చేసుకుంది లేదు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!