మరో పవర్ ఫుల్ రోల్ లో అనుష్క!

ఎన్టీయార్, ఏయన్నార్, ఎమ్జీయార్ లాంటి స్టార్ హీరోల సరసన నటించడమే కాదు వారితోపాటు సమానమైన గౌరవమర్యాదలు దక్కించుకొన్న ఏకైక నటీమణి భానుమతి. స్టార్ హీరోయిన్ గా, స్టూడియో అధినేత్రిగా, గుణవతి అయిన భార్యగా, బాధ్యత ఎరిగిన తల్లిగా భానుమతి స్థానం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఆమె తర్వాత ఆ స్థాయి నటీమణి తెలుగులోనే కాదు ఏ చిత్ర పరిశ్రమలోనూ పుట్టలేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి నటీమణి పాత్రను రిప్రైజ్ చేయాలంటే ఆ పాత్ర పోషించే నటీమణి స్థాయి కూడా ఇంచుమించుగా ఆమెకు దగ్గరా ఉండాలి. అందుకే “మహానటి” చిత్రంలో భానుమతి పాత్రలో నటించేందుకు అనుష్కను అడిగారాట.

ఇటీవల “భాగమతి” చిత్రంతో సూపర్ హిట్ కొట్టడమే కాక అందరి చేత స్వీటీ అని పిలవబడే అనుష్క ఈ రోల్ కి పర్ఫెక్ట్ అని భావించిన దర్శకుడు నాగఅశ్విన్ ఆల్రెడీ అనుష్కకు తన రోల్ వివరించడం జరిగిందట. ఇప్పుడు అనుష్క ఒకే చెప్పడమే తరువాయి. “భాగమతి” అనంతరం మరో సినిమా అంగీకరించని అనుష్క.. “మహానటి”లో భానుమతి పాత్ర చేస్తుందా లేదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus