పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న అనుష్క

స్వీటీ అనుష్క బాహుబలి తర్వాత వేగం పెంచుతుందనుకుంటే… తగ్గించింది. కేవలం ఒక్కటి అంటే ఒక్క సినిమానే చేసింది. అది భాగమతి. ఈ ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. స్టార్ హీరోలకు చిత్రాలకు సమానంగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఆమె డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు. కోట్లు ఆఫర్ చేస్తున్నారు. అయినా ఆమె మాత్రం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. రోడ్డు, రైలు మార్గాలున్న ప్రాంతాలకే కాదు అతి క్లిష్టమైన కేదార్‌నాథ్‌ ని దర్శించుకున్నారు. ఇద్దరు సభ్యులతోపాటు అనుష్క కేదార్‌నాథ్ చేరుకున్నారు. అనంతరం కేదారేశ్వరుణ్ణి దర్శించుకుని పూజలు నిర్వహించారు.

యాత్రలో ఉన్న కొందరు ఆమెను గుర్తించడం విశేషం. దేవుని సన్నిధిలో ఫోటోలు ఇవ్వడానికి ఇష్టం లేకపోయినప్పటికీ.. అభిమానుల ఒత్తిడితో అనుష్క వారితో ఫొటోలు తీసుకున్నారు. . కాలిబాటన ధామానికి చేరుకున్న ఆమె తిరుగు ప్రయాణంలో 17 కిలో మీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు గుర్రం సహాయాన్ని తీసుకున్నారు. మరిన్ని పుణ్య క్షేత్రాలను దర్శించే పనిలో అనుష్క ఉన్నారు. ఈ యాత్రల అనంతరం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమాని ప్రారంభిస్తారా ? లేకుంటే పెళ్లి శుభవార్తను చెబుతారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus