Anushka: ఆ మెడిసిన్ కారణంగానే అనుష్క బరువు తగ్గలేదా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి అనుష్క శెట్టి ఒకరు. సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక అరుంధతి సినిమా ఈమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అప్పటినుంచి అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తి చూపించారు.

ఇలా తన సినీ కెరియర్లో ఈమె నటించినటువంటి ప్రయోగాత్మక సినిమాలలో సైజ్ జీరో ఒకటి ఈ సినిమా తన సినీ కెరియర్ పై చాలా ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి ఈ సినిమా కోసం అనుష్క చాలా శరీర బరువు పెరిగిపోయారు. అనంతరం శరీర బరువు తగ్గడం కోసం ఈమె ఎంతో కష్టపడ్డారు అయినప్పటికీ శరీర బరువు తగ్గకపోవడంతో కొంతకాలం పాటు సినిమాలకు కూడా దూరం కావాల్సి వచ్చింది.ఇలా ఒక యోగా టీచర్ అయినటువంటి అనుష్క ఎన్నో రకాల డైట్ ఫాలో అవుతూ యోగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా తన శరీర బరువును కంట్రోల్ చేసుకోలేకపోయారు.

ఈ విధంగా ఈమె తన శరీర బరువు తగ్గకపోవడానికి కారణం లేకపోలేదు అనుష్క ఎన్ని ప్రయత్నాలు చేసిన శరీర బరువు తగ్గకపోవడానికి గల కారణం ఆమెకు ఉన్నటువంటి సమస్యేనని ఆ సమస్య కారణంగా తరచూ మందులు వాడటం వల్ల అనుష్క శరీర బరువు తగ్గడానికి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పాలి. అనుష్క థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారట ఇలా థైరాయిడ్ సమస్య ఉన్నవారు శరీర బరువు తగ్గడానికి చాలా కష్టమనే చెప్పాలి.

థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి (Anushka) అనుష్క ప్రతిరోజు మందులు ఉపయోగించటం వల్ల ఆ మందుల ప్రభావం కారణంగా కూడా ఈమె శరీర బరువు తగ్గ లేకపోతున్నారని చెప్పాలి. ఏది ఏమైనా అనుష్క మునుపటిలా తయారవ్వడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు. అనుష్క సినిమాల విషయానికి వస్తే చాలా సంవత్సరాల తర్వాత ఈమె మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈమె ఇతర భాష సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus