జ్యోతిక పోషించిన రోల్ చేయనున్న అనుష్క

సూర్యని పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక తమిళ డైరక్టర్ బాలా దర్శకత్వంలో నటించారు. ‘నాచియార్‌’ అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక పోలీస్ అధికారిగా అదరగొట్టారు. అయితే ఆమె చెప్పిన డైలాగ్ వివాదస్పదమయింది. మహిళా సంఘాలు ఈ డైలాగ్ పై ఫిర్యాదులు సైతం చేశాయి. ఈ సినిమా గత నెల రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనీ భావిస్తున్నారు. ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాత కల్పనా కోనేరు సొంతం చేసుకున్నారని తెలిసింది. ఇందులో జ్యోతిక పోషించిన పాత్రలో అనుష్క నటించనుందని సమాచారం. అనుష్క కి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ఉంది.

ఆమెకు తెలుగు అభిమానులు ఎక్కువ. ఆమె ఈ పాత్రను ఎంచుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మహిళల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె.. మహిళలను కించే పరిచే విధంగా డైలాగులు చెప్పే పాత్ర చేయడం మంచిది కాదని కొంతమంది హితవు పలుకుతున్నారు. అన్ని రకాల పాత్రలు పోషిస్తేనే నటిగా అనుష్క పేరు గుర్తుంటుందని మరికొంతమంది సమర్థిస్తున్నారు. మరి అనుష్క ఈ సినిమాకి సైన్ చేసే ముందు ఎవరి మాటలను పరిగణలోకి తీసుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus