గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్న అనుష్క..!

Advertisement

అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఈ సమ్మర్ కే విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ వైరస్ మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో అది కుదర్లేదు.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా ఓటిటి లో విడుదల చెయ్యమని కొన్ని డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు నిర్మాతల వెంటపడ్డాయి.భారీ రేటు పలికాయట కూడా..! అయినప్పటికీ నిర్మాతలు వద్దనుకున్నారని సమాచారం. అయితే మరో 3నెలల పాటు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు కాబట్టి..

‘నిశ్శబ్డం’ ను వారు ఓటిటిలో విడుదల చేసే ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. సరే ఇది పక్కన పెడితే.. తాజాగా అనుష్క ఓ గోల్డెన్ ఛాన్స్ వదులుకుందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఓటిటి సంస్థల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న నెట్ ఫ్లిక్స్ వారు భారీ బడ్జెట్ తో వెబ్ సిరీస్ ను నిర్మించాలని ప్లాన్ చేశారట. ఇందులో ఓ హీరోయిన్ కోసం అనుష్క ని సంప్రదించారట.ఇందుకు గాను ఆమెకు వారు భారీగా పారితోషికం ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారట.

అనుష్క.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ కాబట్టి సౌత్ లో ఆ వెబ్ సిరీస్ కు భారీ క్రేజ్ ఏర్పడుతుంది అనేది వారి అభిప్రాయం కావచ్చు. కానీ అనుష్క మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. దాంతో అనుష్క మంచి ఛాన్స్ మిస్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news