సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికల సమయంలో సినిమాలను రిలీజ్ చేయడానికి మేకర్స్ పెద్దగా ఇష్టపడరు. ఎన్నికల సమయంలో ప్రజల మూడ్ వేరే విధంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. మే నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ వల్ల సమ్మర్ సినిమాలకు ఇబ్బందే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టిల్లు స్క్వేర్ (Tillu Square) ఈ నెల 29వ తేదీన ఫ్యామిలీ స్టార్ (Family Star) ఏప్రిల్ నెల 5వ తేదీన రిలీజ్ కానున్నాయి.
ఈ సినిమాలకు ఏపీ ఎలక్షన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి (Kalki) సినిమా మే 9వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న నేపథ్యంలో ఆ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కల్కి మేకర్స్ స్పందిస్తే మాత్రమే ఆ తేదీకి ఈ సినిమా విడుదలవుతుందో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎన్నికల తర్వాత మే 17వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది.
ఈ ఏడాది పాన్ ఇండియా హీరోల సినిమాలేవీ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. దేవర వాయిదా పడటంతో ఫీలవుతున్న అభిమానులకు కల్కి వాయిదా పడితే మరో షాక్ తగులుతుంది. కల్కి వాయిదా పడితే ఆ తేదీకి రిలీజ్ కావడానికి వేర్వేరు చిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయని భోగట్టా. ఏపీ ఎన్నికలు ప్రభాస్ (Prabhas) సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో చూడాల్సి ఉంది.
మరోవైపు గామి (Gaami) సినిమాతో సక్సెస్ సాధించిన విశ్వక్ సేన్ (Vishwak Sen) రెండు నెలల గ్యాప్ లోనే మరో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధపడటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుని ఫ్యాన్స్ ను మరింత సంతోషానికి గురి చేయడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!