AP Tickets: ఏపీ సర్కార్ నిర్ణయం వల్లే ఇలా జరిగిందా?

కరోనా ఫస్ట్ వేవ్ ముందు పెద్ద సినిమాలు విడుదలైతే మల్టీప్లెక్స్ లతో పాటు సింగిల్ స్క్రీన్లు సైతం ప్రేక్షకులతో కళకళలాడేవి. కరోనా ఫస్ట్ వేవ్ ముందు విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలు విడుదలైన సమయంలో టికెట్ రేట్ల గురించి ఎలాంటి నెగిటివ్ కామెంట్లు వినిపించలేదు. ఆ తర్వాత లాక్ డౌన్ వల్ల కొంతకాలం పాటు థియేటర్లు మూతబడ్డాయి. అయితే లాక్ డౌన్ తర్వాత విడుదలైన ఉప్పెన సినిమా సైతం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అయితే వకీల్ సాబ్ విడుదలకు ఒకరోజు ముందు ఏపీ సర్కార్ టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వకీల్ సాబ్ ఏపీ కలెక్షన్ల విషయంలో భారీగా నష్టపోయింది. పుష్ప ది రైజ్ ఇండస్ట్రీ హిట్ అయినా ఏపీలోని పలు ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.

అయితే అఖండ, పుష్ప ది రైజ్, భీమ్లా నాయక్ సినిమాను ప్రదర్శించిన థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడాయి. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాలకు టికెట్లు దొరికే పరిస్థితులు కనిపించలేదు. అయితే రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాల విషయంలో ఈ పరిస్థితి మారిపోయింది. ఈ సినిమాలకు తొలిరోజే టికెట్లు దొరికే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ సర్కారు టికెట్ రేట్లను పెంచడంతో పాటు అదనపు రేట్లకు అనుమతులు ఇవ్వడం ఇండస్ట్రీకి శాపంగా మారింది.

తక్కువ టికెట్ రేట్లతో రెండు నెలల క్రితం వరకు సినిమాలను చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువ మొత్తం ఖర్చు చేసి సినిమాలను చూడటానికి ఆసక్తి చూపించడం లేదు. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉన్నా అప్పటికీ ఇప్పటికీ టికెట్ రేట్లలో పెద్దగా మార్పు లేదు. ఏపీలో టికెట్ రేట్లు రెట్టింపు కావడంతో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus