వయసైపోయింది.. అంటే కుర్చీ విసిరికొట్టాడట..!

  • November 27, 2019 / 07:09 PM IST

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ చిత్రం చేస్తున్నాడు. నయన తార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రజినీ కూతురిగా నివేదా థామస్ కనిపించబోతుందని తెలుస్తుంది. అనిరుథ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది.

ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్ మాట్లాడుతూ ‘దర్బార్’ షూటింగ్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ‘ఓ సీన్లో రజనీకాంత్ ఓ కుర్చీని దూరంగా విసిరి కొట్టాలట. అయితే ఆ టైములో కుర్చీ బరువు ఎక్కువగా ఉందట. అప్పటికప్పుడు తేలికైన కుర్చీని తీసుకురావడం వీలు కాలేదట. అలాంటి టైములో రజనీకాంత్ .. ‘కుర్చీని ఎంత దూరంగా విసిరికొట్టాలి’ అని అడిగారట. కెమెరా ముందు పడాలి సర్ అని మురుగదాస్ చెప్పగా.. కేవలం 2 టేక్స్ లో రజినీ కుర్చీని విసిరికొట్టారట. ఈ వయసులో కూడా రజనీకాంత్ ఎనర్జీ లెవెల్స్ చూసి ఆశ్చర్యమేసినట్టు మురుగదాస్ చెప్పుకొచ్చాడు.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus