చిరంజీవి చిత్రానికి ఈ సారైనా రెహమాన్ మంచి మ్యూజిక్ ఇస్తాడా ?
- August 23, 2017 / 06:41 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమాలో నటించే నటీనటులు, టెక్నీషయన్స్ విషయంలో క్లారిటీ వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా నరసింహ రెడ్డి ని సురేందర్ రెడ్డి తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో భారతీయ సినిమా రారాజు అమితాబ్ బచ్చన్, డేరింగ్ స్టార్ జగపతి బాబు, కన్నడ స్టార్ కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లు కీలక పాత్రలు పోషించనున్నారు. నయనతార హీరోయిన్ గా నటించనుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. తొలిసారి రెహమాన్ చిరు మూవీకి సంగీతాన్ని ఇచ్చారు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ వారి కలయికలో ఇది రెండో సినిమా.
మొదటి సినిమా “ద జెంటిల్ మాన్”. అల్లు అరవింద్ హిందీలో నిర్మించిన ఈ సినిమాలో చిరు నటించారు. శంకర్ తెరకెక్కించిన జెంటిల్ మాన్ మూవీకి ఇది రీమేక్. చిరు మూవీకి అప్పుడు అనిల్ మాలిక్ తో కలిసి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ చిరుకి ఆ మూవీ విజయాన్ని అందించలేదు. ఈ సారైనా చిరు, రెహమాన్ కాంబినేషన్ హిట్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















