దళపతి, రోజా, బొంబాయి… ఈ మూడు సినిమాలు చాలు అరవింద్ స్వామి గురించి చెప్పాలంటే. అందానికి తగ్గట్టు అభినయాన్ని ప్రదర్శించి దక్షిణాదిన ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆ తర్వాత ప్రమాదం జరగడంతో అతని కెరీర్ అనుకోని మలుపు తిరిగింది. సినిమాలకు దాదాపు పదేళ్లు దూరంగా ఉన్న అరవింద్ స్వామిని మణిరత్నమే మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చారు. కడలి అనే చిత్రంలో మంచి క్యారక్టర్ ఇచ్చారు. ఆ మూవీ హిట్ కాకపోయినా… తని వరువన్ చిత్రం ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇది సూపర్ హిట్ అయింది. ఇందులో నటనను మెచ్చి తెలుగు వెర్షన్ ధృవ లోను తీసుకున్నారు. ఇక్కడ హిట్టే. రీ ఎంట్రీ లో కెరీర్ ఊపందుకుంది. ప్రస్తుతం “శతురంగ వేట్టై” సినిమా చేస్తున్నారు.
ఇందులో త్రిష నాలుగు సంవత్సరాల పిల్లకి తల్లిగా నటిస్తోంది. ఈ సినిమా కోసం కోటి డెబ్భై లక్షలు ఇస్తానంటే అరవింద స్వామి ఒప్పుకున్నారు. సినిమా షూటింగ్ పూర్తీ కావొస్తున్నా కూడా నిర్మాత రెమ్యూనరేషన్ చెల్లించక పోవడంతో నిర్మాత మనోబాల పై అరవింద స్వామి కేసు పెట్టాడు. దాంతో కోర్టుకు విచారణ ఇవ్వాలంటూ విచారణ జరిపిన కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 18 శాతం వడ్డీతో మరి చెల్లించాలని కోర్టు ఆర్డర్ వేసింది. ఏ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నెల 20న తుది తీర్పు వెలువడనుంది. నిర్మాత డబ్బులు చెల్లిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్ర డైరక్టర్ ఎన్వీ నిర్మల్ కుమార్ మాత్రం గొడవలు ఆగిపోయి.. సినిమా రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు.