ఇండస్ట్రీని బెంబేలెత్తించిన ఎడిటర్ పైరసీ ప్రయత్నం

  • August 13, 2018 / 06:15 AM IST

నిన్న సాయంత్రం రాజేష్ అనే ఎడిటర్ కొన్ని పెద్ద సినిమాల ఎడిటింగ్ సూట్ విజువల్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడని, ఈ ముఠాలో కొందరు విద్యార్ధులు కూడా భాగస్వాములై ఉన్నారనే వార్త దాదాపు అన్నీ న్యూస్ చానల్స్ లో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తొలుత అందరూ ఈ హార్డ్ డిస్క్ లో కేవలం “గీత గోవిందం” సినిమాకి సంబంధించిన విజువల్స్ మాత్రమే ఉన్నాయనుకొన్నారు. కట్ చేస్తే.. ఇదే హార్డ్ డిస్క్ లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “అరవింద సమేత” మరియు మహేష్ బాబు-వంశీ పైడిపల్లిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న “మహర్షి” సినిమాకి సంబంధించిన రఫ్ విజువల్స్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తోంది.

పోలీసులు ఆల్రెడీ ఆ హార్డ్ డిస్క్ ను అదుపులోకి తీసుకొన్నప్పటికీ.. ఈపాటికి ఎన్ని కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ లో కాపీ చేశాడో తెలియడం లేదు. పొరపాటున ఆ కంటెంట్ గనుక బయటకి వస్తే సినిమాకి భీభత్సమైన లాస్ వస్తుంది. ఈ విషయం తెలిసేసరికి రెండు సినిమాల నిర్మాతలకు గుండె ఆగినంత పనయ్యింది. వెంటనే యాంటీ పైరసీ బృందం రంగంలోకి దిగి.. ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ ట్రేసస్ కోసం ఆన్ లైన్ లో వెతకడం మొదలుపెట్టారు. అయితే.. ఎవరికీ అంతుబట్టని విషయం ఏంటంటే.. ఇంత భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన డేటా ఒక థర్డ్ పార్టీ ఎడిటర్ వద్దకు ఎలా వెళ్లింది అనేది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus