11 రోజుల్లో “అరవింద సమేత” సాధించిన షేర్

“ప్రతి సినిమా ఒక ఆలోచనతోనే మొదలు పెడతాం. ఈ కథకు తొలి ప్రేక్షకుడు హీరోనే అవుతాడు. ఈ సినిమా మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికి, నాలుగు రోజుల్లోనే 100 కోట్లు దాటించడానికి సారథి ఎన్టీఆర్ మాత్రమే” అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తారక్ పై అభినందనలు గుప్పించిన సంగతి తెలిసిందే. సినిమాకి దర్శకుని ప్రతిభ ఎంత ఉన్నప్పటికీ కలెక్షన్లు పరుగులు పెట్టాలంటే అది క్రేజ్ ఉన్న హీరోకి మాత్రమే సాధ్యం. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న యంగ్ టైగర్ అద్భుతంగా నటించిన “అరవింద సమేత” ఈనెల 11 న రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ తొలి వీకెండ్ లోనే 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. దసరా సెలవులు కావడంతో వీక్ డేస్ లోను భారీ కలక్షన్స్ సాధిస్తోంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి 151 కోట్ల (గ్రాస్) మార్కును అధిగమించింది. ఆదివారం (11 రోజుల్లో) నాటికీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 69 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల షేర్ మార్క్ ను దాటి దూసుకుపోతోంది. ఇంతవేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే తొలిసారని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో వందకోట్ల క్లబ్ (షేర్) లో చేరిపోతుందని అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus