“ఆపరేషన్ సక్సస్.. పేషేంట్ డెడ్” అన్న రీతిలో ఉంది “అరవింద సమేత” విజయాన్ని చూస్తుంటే. యంగ్ టైగర్ అద్భుతంగా నటించిన “అరవింద సమేత” ఈనెల 11 న రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ తొలి వీకెండ్ లోనే 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. దసరా సెలవులు కావడంతో వీక్ డేస్ లోను భారీ కలక్షన్స్ సాధిస్తోంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి 151 కోట్ల (గ్రాస్) మార్కును అధిగమించింది. ఆదివారం (11 రోజుల్లో) నాటికీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 69 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల షేర్ మార్క్ ను దాటి దూసుకుపోతోంది.
ఇంతవేగంగా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం ఎన్టీఆర్ కెరియర్లో ఇదే తొలిసారి. అయితే ఈ చిత్రానికి వస్తున్న కలెక్షన్స్ ఫేక్ అని కొంతమంది విమర్శిస్తుంటే.. మరికొంతమంది ప్రీ రిలీజ్ బిజినెస్ లో చేసినంత అన్ని చోట్లా లాభాలను ఈ చిత్రం తెచ్చి పెట్టలేదని వాపోతున్నారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలను చవిచూశారని అంటున్నారు. ఓవర్సీస్ లో ఇదే పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. 2 మిలియన్ డాలర్లు వసూలు చేసినా లాభాలను అందుకోవాలంటే మరికొంత వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంటుంది.