వరుసగా నాలుగు విజయాల తర్వాత ఎన్టీఆర్ చేసిన మూవీ… రాయలసీమ నేపథ్య కథ… త్రివిక్రమ్ దర్శకత్వం.. ఇలా అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న అరవింద సమేత వీర రాఘవ మూవీ నిన్న భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అంచనాలకు మించి సినిమా ఉండడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ అన్నివర్గాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 26 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఇతర ప్రాంతాల్లోనూ భారీ కలక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా “అరవింద సమేత” తొలిరోజు 36 కోట్ల షేర్ వసూలు చేసి ఎన్టీఆర్ సత్తాని చాటింది. కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా.. కోట్లలో..
ఏరియా : కలక్షన్స్ (షేర్ ) నైజాం : 5.73 సీడెడ్ : 5.48 ఉత్తరాంధ్ర : 3.12 గుంటూరు : 4.14 కృష్ణ : 1.97 ఈస్ట్ గోదావరి : 2.77 వెస్ట్ గోదావరి : 2.37 నెల్లూరు : 1.06 తమిళనాడు : 1.00 కర్ణాటక : 3.75 ఇతర ప్రాంతాల్లో : 0.50 ఓవర్సీస్ : 5.15 ప్రపంచవ్యాప్తంగా :36 .04