మలయాళంలోనూ మంచి హిట్ అందుకున్న అరవింద సమేత

మోహన్ లాల్ తో కలిసి “జనతా గ్యారేజ్”లో చేసిన తర్వాత జూనియ‌ర్ ఎన్టీఆర్ కు మ‌ల‌యాళంలో కూడా పెద్ద సంఖ్య‌లో అభిమానులు ఏర్పడ్డారు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకొనే పనిలో భాగంగా “అరవింద సమేత” చిత్రాన్ని మలయాళంలో అనువాద రూపంలో విడుదల చేశారు. “వీర‌ రాఘ‌వ‌ రెడ్డి” అనే పేరుతో గ‌త వారం విడుదలైన ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయ్యింది. సాధారణంగా మలయాళ యంగ్ హీరోస్ కు కూడా రాని ఓపెనింగ్స్ ఈ సినిమాకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. విడుద‌ల చేసిన అన్ని థియేట‌ర్ల‌లో క‌లెక్ష‌న్స్ బాగుండ‌టంతో ఇప్పుడు థియేట‌ర్ ల సంఖ్య ను పెంచుతున్నారు.

ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం త్రివిక్రమ్ కు డైరెక్టర్ గా మంచి బూస్ట్ ఇవ్వగా.. అప్పటివరకూ పూజా హెగ్డేపై ఉన్న ఐరన్ లెగ్ ఇమేజ్ కూడా పోయింది. ఈ చిత్రాన్ని త్వరలోనే తమిళంలోనూ అనువదించే ఆలోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు. అయితే.. రీమేక్ రైట్స్ కోసం కొందరు తమిళ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కన పెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus