సుదర్శన్, భద్రం, తల్లాడ సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరేయ్ ఆపండ్రా’. ‘క్రియేటివ్ థింక్స్ గ్యాంగ్’ బ్యానర్‌పై బేబీ హరిణి సమర్పణలో, అశోక్ నిమ్మల నిర్మిస్తున్న ఈ చిత్రానికి తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు.వెంకట్ దుగ్గిరెడ్డి, అంజాద్ సహ నిర్మాతలు.మే 15న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకానుంది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మే 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. అందుకు కారణం కూడా చిత్ర బృందం వివరించింది.
నిర్మాత అశోక్ నిమ్మల మాట్లాడుతూ..”ఈ సమ్మర్‌లో ప్రేక్షకులకు ఒక మంచి కామెడీ సినిమాని అందించబోతున్నాం. మా బడ్జెట్‌లోనే సినిమాని కంప్లీట్ చేశాం.దర్శకుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు” అని అన్నారు.
సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ మంచి సినిమాలో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.
సహ నిర్మాత అంజాద్ మాట్లాడుతూ..”ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమాని షూట్ చేశాం. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది, ప్రేక్షకులను కచ్చితంగా మెప్పిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.
దర్శకుడు, నటుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ..”నేటి సమాజంలో ఉన్న పరిస్థితులను అందరూ రిలేట్ అయ్యేలా మా చిత్రాన్ని తెరకెక్కించాం. అందరికీ రిలేట్ అవుతుంది. మంచి ఫన్ ఉంటుంది. అలాగే అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. మే 15న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో హీరో రామ్ కి వీరాభిమాని. మా లాంటి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ రామ్ అన్న ఇన్స్పిరేషన్. ‘ఒంగోలు గిత్త’ సినిమాలో రామ్ అన్నతో నటించిన కిషోర్ దాస్ గారు మా సినిమాలో నటించడం కూడా చెప్పుకోదగ్గ విషయం” అంటూ ధీమా వ్యక్తం చేశారు.
నటుడు వినోద్ నువ్వుల మాట్లాడుతూ..”ఈ సినిమాలో నేను ఒక పోలీస్ గా కనిపిస్తాను. న్యాయానికి సరైన మార్గాన్ని చూపిస్తూ సాగే నా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
నటుడు కిషోర్ దాస్ మాట్లాడుతూ..”నేను ఎప్పుడూ నవ్వించే పాత్రలే చేసేవాడిని. కానీ ఈ సినిమాలో మా సాయి నన్ను ఏడిపించాడు. ఒక బాధ్యత గల తండ్రి పాత్రలో జీవించాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.మా రామ్ పుట్టిన రోజు నాడు మా సినిమాని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.