బిగ్ బాస్ ఇంట్లో తన పని తను చేసుకుంటూ గేమ్ ఆడాలి. టాస్క్ లు ఇచ్చినప్పుడు కలిసికట్టుగా ఆడి గెలవాలి, గెలిపించాలి. అలా అయితేనే ప్రేక్షకుల మన్ననలు పొందుతారు, ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటారు. కానీ కొందరు పక్కవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతుంటారు. ఈ సీజన్ లో అఖిల్ అలా కనిపిస్తున్నాడు అంటున్నారు నెటీజన్స్. తనది కానీ విషయంలో అతి జోక్యం చేసుకుంటాడనే అపవాదు అఖిల్ మీద తొలి రోజుల నుంచి ఉంది.
ఈ రోజు నామినేషన్ టైం లో అభిజీత్ అదే విషయం రైజ్ చేశాడు. నామినేషన్ కారణాలు చెప్తున్నప్పుడు ‘ వేలెత్తి చూపించొద్దు’ అని అఖిల్ అన్నాడు. దానికి అభి కరెక్ట్ గా ఇచ్చి పడేశాడు. నువ్వు ఇన్నాళ్లూ ఇదే చేశావ్ గా అని అడిగాడు. దానికి అఖిల్ ‘నువ్వు మొన్న మోనల్ తో కూడా ఇలానే వేళ్ళు చూపించే మాట్లాడవ్’ అంటూ మోనాల్ ని మధ్య లోకి తెచ్చాడు. దీంతో అభి మళ్ళీ పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు. ‘ఆమె విషయం ఎందుకు ఈ చర్చలో. నేను ఆమెతో మాట్లాడుకుంటా’ అని అన్నాడు. దీంతో అఖిల్ కి నోటి మాట కరువైంది.
మరోవైపు మోనల్ కూడా స్పందించింది. మీ చర్చ లో నన్ను లాగొద్దు అంటూ అరిచి ఏడ్చేసింది. ఇదంతా చూస్తుంటే ఈ రోజు నామినేషన్ వాడి వేడిగా సాగినట్లు ఉంది. చూద్దాము ఇంకా ఏమైందో ఈ రోజు రాత్రికి. అన్నట్లు నామినేషన్ టైంలో అఖిల్ ఏదో అబద్దం కూడా చెప్పాడని అభి అంటున్నాడు. ఆ సంగతీ ఈ రోజు రాత్రి తెలుస్తుంది.