అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి క్రేజీ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అరి’. ఇది ఒక మైథలాజికల్ టచ్ ఉన్న మెసేజ్ మూవీ. ‘కార్తికేయ 2’ ‘కాంతార’ ‘హనుమాన్’ ‘మిరాయ్’ ‘కాంతార చాప్టర్ 1’ వంటి చిత్రాల స్టైల్లో డివైన్ టచ్ ఉంటుంది. ఆ ట్రెండ్ ను అనుసరిస్తూనే ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్. 7 ఏళ్లుగా ‘అరి’ కోసం అతను కష్టపడ్డాడు. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అరి’. దర్శకుడు ఎంపిక చేసుకున్న పాయింట్ అలాగే క్లైమాక్స్ కి మంచి మార్కులు పడ్డాయి.
ARI
శ్రీకృష్ణుడు ఎంట్రీ,అరిషడ్వర్గాల కాన్సెప్ట్ తో ఇచ్చిన మెసేజ్ కి ఆడియన్స్ రిలేట్ అయ్యారు.7 ఏళ్ళ తర్వాత దర్శకుడు జయశంకర్ మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వెంకయ్య నాయుడు వంటి లెజెండరీ పొలిటీషియన్స్ ఆయన పై ప్రశంసలు కురిపించారు.
క్రిటిక్స్ సైతం చివరి 20 నిమిషాల గురించి ప్రత్యేకంగా కొనియాడారు.అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌ను తీసుకుని ఆరు విభిన్న పాత్రలతో సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు అంటూ దర్శకుడిపై ప్రశంసలు కురిపించారు.
ఇక ‘అరి’ సినిమాలో అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష..లతో పాటు వినోద్ వర్మ, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి వంటి వారు కూడా అతి కీలకమైన పాత్రలు పోషించారు.