యూత్ యువరాజ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ రామ్ కామ్ మూవీ ‘తెలుసు కదా’ రిలీజ్‌కు రెడీ అయింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి కొద్దిపాటి కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అయితే, సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్ కారణంగా పలు డైలాగ్స్‌కు, ముఖ్యంగా కొన్ని బూతు డైలాగులకు కత్తెర వేసినట్లు సెన్సార్ రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది.
‘తెలుసు కదా’ ట్రైలర్ చూశాక, సినిమా చాలా బోల్డ్‌గా, ఇంటెన్స్..గా ఉంటుందని అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ప్రిపేర్ చేసినట్టు అయ్యింది. ఇప్పుడు సెన్సార్ రిపోర్ట్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసినట్టు అయ్యింది. సెన్సార్ బోర్డ్ తొలగించిన సన్నివేశాలను గమనిస్తే :
‘నేను వంగుతా వచ్చి ఎక్కు’ అంటూ ట్రైలర్ చివర్లో ఉన్న బోల్డ్ డైలాగ్‌ను మ్యూట్ చేశారు.
‘కర్రి నా కొ*కా’ ‘ముండ’ ‘ఉచ్చ’ ‘సంక నాకుదాం’ వంటి పలు అభ్యంతరకరమైన పదాలను కూడా మ్యూట్ చేసినట్లు తెలుస్తుంది.
మొత్తంగా 23 సెకన్ల నిడివి గల సన్నివేశాలు, డైలాగ్స్‌ను కట్ చేసినట్లు సెన్సార్ రిపోర్ట్ స్పష్టంచేసింది.
స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ప్రేమించే యువకుడిగా, కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సిద్దు కనిపించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఇది రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదని ట్రైలర్‌తోనే క్లారిటీ ఇచ్చారు.ఫైనల్‌గా 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో అక్టోబర్ 17న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది ‘తెలుసు కదా’. మరి ఈ బోల్డ్ కంటెంట్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.