Ariyana, Akhil: అషూ చేసిన పనికే అరియానా అరిచిందా..! అరియానా గేమ్ ప్లాన్ ఇదేనా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో ఏలియన్స్ వర్సెస్ హ్యూమన్స్ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈవారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు ఎంపిక అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. హ్యూమన్స్ ఏలియన్స్ కి సంబంధించిన రెండు లైఫ్ బాల్స్ ని పగలగొట్టేశారు. ఇందులో అఖిల్ కీలకపాత్ర వహిస్తే, అషూరెడ్డి బిందుని అసలు గేమ్ ఆడకుండా లాక్ చేసేసింది. నిజానికి అషూరెడ్డి చేతులకి పెయింట్ పూసింది హమీదా. దీంతో హ్యూమన్స్ నుంచీ రెండు పాయింట్స్ కోల్పోయి ఛార్జింగ్ ని సంపాదించారు ఏలియన్స్. కానీ, అషూరెడ్డి గేమ్ ఆడుతూనే ఉంది.

Click Here To Watch NOW

దీనిపై హమీదా అబ్జక్ట్ చేసింది. దీంతో బిగ్ బాస్ అషూని కేవలం లైఫ్ బాల్ చేజిక్కుంచోమని మాత్రమే చెప్పాడు. ఇక్కడే అరియానా బెడ్ రూమ్ లో మూల దాక్కుని లైఫ్ బాల్ ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. అందరూ వచ్చి మీద పడుతున్నా కూడా చాలాసేపు పోరాడింది. అషూరెడ్డి అరియానా మీద పడి మరీ లైఫ్ బాల్ ని గుంజుకునే ప్రయత్నం చేసింది. అలా బెడ్ రూమ్ లో మూల ఇరుక్కుపోవడం వల్ల అజయ్ కి, శివకి, అఖిల్ కి దెబ్బలు తగిలాయి.

అంతేకాదు, హమీదా గోళ్లు కూడా అఖిల్ కి గీసుకున్నాయి. ఇది ఫిజికల్ టాస్క్ లాగా మారిపోయింది. సంచాలక్ బాబాభాస్కర్ గేమ్ ని పాజ్ చేయగానే అరియానా పైకి లేచి బాబాభాస్కర్ కి తన గేమ్ గురించే చెప్పే ప్రయత్నం చేసింది. కానీ, అఖిల్ మద్యలో అడ్డుపడ్డాడు. అలా మూల దాక్కుని గేమ్ ఆడితే దెబ్బలు తగులుతాయి అని, ఊపిరి కూడా అందదు అంటూ మాట్లాడుతుంటే, అరియనా సీరియస్ అయిపోయింది. అఖిల్ పై గట్టిగట్టి గా అరుస్తూ రెచ్చిపోయింది.

నేను సంచాలక్ తో మాట్లాడుతున్నా అని మద్యలో నువ్వు రావద్దని సీరియస్ గా పెద్దగా అరుస్తూ మరీ చెప్పింది. దీనికి అఖిల్ కూడా అరియానా పై అరిచాడు. సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత గేమ్ తిరిగి మళ్లీ ప్రారంభం అవ్వగానే అరియానా అక్కడే దాక్కుంది. కానీ, బిగ్ బాస్ ఎనౌన్స్ చేసేసరికి లివింగ్ రూమ్ కి రాక తప్పలేదు. అజయ్, హమీదా ఇద్దరూ అరియానాని ప్రొటక్ట్ చేశారు. దీంతో మొదటిరోజు ఆట ముగిసిందని బిగ్ బాస్ ఎనౌన్స్ చేశాడు.

అరియానా దగ్గర ఉన్న లైఫ్ బాల్ మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ ఇది పగలకొట్టేస్తే హ్యూమన్స్ గేమ్ లో ముందుకు వెళ్తారు. ఏలియన్స్ ఒక్క హ్యూమన్ చేతికి రంగు రాసినా కూడా గేమ్ లో గెలుస్తారు. మరి ఈరోజు టాస్క్ లో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus