యాక్షన్ కింగ్ అర్జున్ 150వ సినిమా ‘కురుక్షేత్రం’

యాంక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150 సినిమా కురుక్షేత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలకు సిద్దం అయ్యింది. తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్ కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీని అత్యంత స్టైలిష్ గా తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న ఈమూవీని భారీగా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో

తమిళ నిర్మాత ఉమోష్ మాట్లాడుతూ:
‘ప్యాషన్ స్టూడియో నుండి మేం నిర్మించిన రెండో చిత్రం ఈ కురుక్షేత్రం. తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులో అంతకంటే మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. వీటితో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. వాటిలో సిద్దార్ధ హీరోగా ఒక ప్రాజెక్ట్ ఉంది. తెలుగు ప్రేక్షకులు మా మొదటి సినిమా ‘ పాండవులలో ఒకడు’ ను మంచి గా ఆదరించారు. కురుక్షేత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అన్నారు.

దర్శకుడు అరుణ్ వైద్యనాథన్ మాట్లాడుతూ:
‘కురుక్షేత్రం తెలుగు లో మంచి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్న టైంలో నిర్మాతలు సాయి, శ్రీనివాస్ లు కలిసారు. తెలుగు లో వారు చిన్న మార్పులను సూచించారు. తెలుగు లో సినిమా ఇంకా గ్రిప్పింగ్ ఉండేలా చేసాం. క్రైం యాక్షన్ ని ఇష్టపడే వారిని తప్పకుండా థ్రిల్ చేస్తుంది. నాకు తెలుగు ప్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందుకని తెలుగు రిలీజ్ గురించి చాలా ఆసక్తిగా ఉన్నాను. తప్పకుండా సక్సెస్ అవుతామనే నమ్మకం ఉంది ’ అన్నారు.

కో ప్రొడ్యూసర్ లలో ఒకరైన సాయి కృష్ణ పెండ్యాల మాట్లాడుతూ:
‘ కురుక్షేత్రం తెలుగు లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వినాయక చవితికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. అర్జున్ సినిమా నుండి ఆశించిన ఎలిమెంట్స్ అన్నీ కురుక్షేత్రం లో ఉంటాయి. తెలుగు లో మంచి విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నాను అన్నారు.

మరోనిర్మాత మీసాల శ్రీనివాస్ మాట్లాడుతూ:
‘దాదాపు రెండు వందలకు పైగా థియేటర్స్ లో వినాయకచవితికిఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. అర్జున్ 150 సినిమా ని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ’ అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus