Arjun Ambati: ఆ పాత్ర అర్జున్ చేసి ఉంటే వేరే లెవెల్ ఉండేది !

ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవ్వరూ ఊహించని ఉల్టా పల్టా ట్విస్టులతో ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ హౌస్ లోకి గత వారం అర్జున్ అంబటి అనే సీరియల్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.

ఎంతో కూల్ గా, చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతూ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. సీరియల్ హీరో గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అంబటి అర్జున్, పలు సినిమాల్లో ముఖ్య పాత్రలు కూడా పోషించాడు. అయితే అవి చిన్న సినిమాలు అవ్వడం తో అర్జున్ కి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. పక్కన పెడితే అంబటి అర్జున్ కి పుష్ప సినిమా ఆడిషన్స్ కోసం అప్పట్లో పిలుపు వచ్చిందట.

అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఆడిషన్స్ ఇచ్చే అదృష్టం దొరికింది , ఎంత చిన్న పాత్ర అయినా పర్వాలేదు, చేసేస్తాను అని అక్కడికి వెళ్ళాడట. ఆడిషన్స్ చేసిన తర్వాత అంబటి అర్జున్ ని చూసి సుకుమార్ భయపడ్డాడట. ఏంటి సీరియల్స్ అన్నీ పూర్తి అయ్యాయా? అని అడిగాడట. తానూ ఒక సీరియల్ హీరో అని , తన సీరియల్స్ ని సుకుమార్ ఫాలో అవుతున్నాడని తెలిసి ఎంతో సంతోషించాడట అంబటి అర్జున్. కానీ ఆ సినిమాకి అర్జున్ సెలెక్ట్ అవ్వలేదట.

సుకుమార్ సినిమాలో ప్రతీ చిన్న పాత్రకి ఆయన కోరుకున్న విధంగా బాడీ లాంగ్వేజ్ తో సహా పర్ఫెక్షన్ ఉండాలి. అప్పుడే ఆయన తన సినిమాలోకి తీసుకుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు అంబటి అర్జున్. ఇంతకీ ఆయన మిస్ అయిన పాత్ర మరేదో కాదు, ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు ‘శత్రు’ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర. ఇది చిన్న పాత్ర ఏమి కాదు, చాలా ముఖ్యమైన పాత్రే, అర్జున్ (Arjun Ambati) చేసి ఉంటే ఈరోజు టాలీవుడ్ మోస్ట్ బిజీ ఆర్టిస్ట్స్ లో ఒకడిగా నిల్చేవాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus