Arjun Sarja:అల్లుడికి అర్జున్ ఇచ్చిన కట్నం లెక్కలివే.. ఏకంగా అంతిచ్చారా?

  • June 21, 2024 / 05:00 PM IST

యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలలో ఆయన నటించారు. అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య  (Aishwarya Arjun) పెళ్లి కొన్నిరోజుల క్రితం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ నటుడు తంబిరామయ్య (Thambi Ramaiah) కొడుకు ఉమాపతి, ఐశ్వర్య ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న అర్జున్ తంబిరామయ్యతో మాట్లాడి కూతురి పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు.

అయితే అర్జున్ ఎంత కట్నం ఇచ్చారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండగా ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. అర్జున్ కోట్ల రూపాయల విలాసవంతమైన బంగ్లాను కూతురికి గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. అదే సమయంలో డబ్బు రూపంలో సైతం కోట్ల రూపాయలు అల్లుడికి కట్నంగా ఇచ్చారని భోగట్టా. అయితే ఇలాంటి విషయాల గురించి సెలబ్రిటీలు స్పందించి నిజాలు చెప్పే పరిస్థితులు అయితే ఉండవు.

అర్జున్ కు ఇద్దరు కూతుళ్లు కాగా భారీ మొత్తం కట్నంగా ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో అర్జున్ బిజీగా ఉన్నారు. తెలుగులో ఈ మధ్య కాలంలో అర్జున్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. అర్జున్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారని చాలామంది అభిమానులు భావించినా సెంటిమెంట్ మాత్రం బ్రేక్ కాలేదనే సంగతి తెలిసిందే.

తర్వాత సినిమాలతో అర్జున్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అర్జున్ తెలుగులో ఒక సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించాలని ఒక ప్రాజెక్ట్ ను మొదలుపెట్టగా వేర్వేరు కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అర్జున్ తనకు ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ రోల్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తూ అభిమానులను పెంచుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus