నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ‘అశోకా క్రియేషన్స్’ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. సాయి మంజ్రేకర్ (Saiee Manjrekar) హీరోయిన్ గా నటించింది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి (Vijaya Shanthi) ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్ (Srikanth) , బబ్లూ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు.
మంచి క్యాస్టింగ్ ఉండటం.. దానికి తోడు సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమాకి బిజినెస్ బాగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 6.20 cr |
సీడెడ్ | 2.00 cr |
ఉత్తరాంధ్ర | 2.00 cr |
ఈస్ట్ | 1.00 cr |
వెస్ట్ | 1.00 cr |
గుంటూరు | 1.50 cr |
కృష్ణా | 1.50 cr |
నెల్లూరు | 0.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 15.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.50 cr |
ఓవర్సీస్ | 1.50 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 18.70 కోట్లు(షేర్) |
‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) సినిమాకు రూ.18.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.19 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘గుడ్ ఫ్రైడే’ హాలిడే ఉంది కాబట్టి.. పాజిటివ్ టాక్ వస్తే, మంచి ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది.