‘అర్జున్ సురవరం’ 14 డేస్ కలెక్షన్స్..!

దాదాపు సినిమాని అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో విడుదలైనప్పటి .. ‘అర్జున్ సురవరం’ మంచి టైంలోనే విడుదలయ్యిందని చెప్పాలి. చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడం.. డీసెంట్ టాక్ రావడం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి ప్లస్ అయ్యింది. నవంబర్ 29న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ పర్వాలేదనిపించే కలెక్షన్లు రాబడుతోంది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించగా… ‘ఠాగూర్’ మధు సమర్పకుడిగా వ్యవహరించాడు. ‘పేక్ సర్టిఫికేట్ ల వల్ల.. ఎంతో ట్యాలెంట్ ఉన్న కొందరి యువత భవిష్యత్తు నాశనమైతోందని.. ఆ ‘ఫేక్ సర్టిఫికేట్ మాఫియాని అంతం చేయడానికి ఓ జర్నలిస్ట్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు’ అనే కధాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం 2 వారాల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

Arjun Suravaram movie still

నైజాం 2.22 cr
సీడెడ్ 0.91 cr
ఉత్తరాంధ్ర 1.01 cr
ఈస్ట్ 0.64 cr
వెస్ట్ 0.50 cr
కృష్ణా 0.66 cr
గుంటూరు 0.80 cr
నెల్లూరు 0.40 cr
ఏపీ + తెలంగాణ 7.14 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
ఓవర్సీస్ 0.60 cr
టోటల్ వరల్డ్ వైడ్ 8.04 cr (share)

‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అయితే కొన్ని ఏరియాల్లో.. నిర్మాతలు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ఇక రెండు వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 8.04 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండు వారాల పాటు ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. ఇప్పటికే బయ్యర్స్ అంతా లాభాల బాట పట్టారని ట్రేడ్ పండితుల సమాచారం. మొత్తానికి నిఖిల్ అకౌంట్ లోకి ఓ సూపర్ హిట్ పడిందనే చెప్పొచ్చు.

Click Here For Arjun Suravaram Movie Review

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus