గతేడాది నాగ చైతన్య- శోభిత, సుబ్బరాజు, అనురాగ్ కులకర్ణి – రమ్య బెహరా, హీరోయిన్ కీర్తి సురేష్ వంటి వారు పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారు అయ్యారు. అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కొత్త ఏడాది ఆరంభంలో ఓ స్టార్ సింగర్ పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశాడు. అతను మరెవరో కాదు అర్మాన్ మాలిక్. తెలుగులో 2010 లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర’ సినిమాలో ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అనే పాటతో కెరీర్ ను ప్రారంభించిన అర్మాన్ మాలిక్..
తర్వాత ‘మహానుభావుడు’ లో ‘రెండు కళ్ళు’ , ‘తొలిప్రేమ’ లో ‘నిన్నిలా నిన్నిలా’ వంటి సూపర్ హిట్ పాటలు పాడి బాగా పాపులర్ అయ్యాడు. తెలుగులో దాదాపు 50 కి పైగా పాటలు పాడి స్టార్ సింగర్ లిస్టులోకి చేరిన ఇతను. తాజాగా పెళ్లి వార్తలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ (Armaan Malik ) తన ప్రియురాలు ఆష్నా ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మీడియాకి దూరంగా ఎటువంటి లీక్ ఇవ్వకుండా చాలా సైలెంట్ గా వీరి పెళ్లి జరిగింది.
తర్వాత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు అర్మాన్ మాలిక్. చాలా కాలంగా అర్మాన్, ఆష్నా ప్రేమలో ఉన్నారట. 2023లో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. కొంత గ్యాప్ తర్వాత వీళ్ళు.. పెద్దగా హడావిడి లేకుండా పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరి.. మధ్య వీరి పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం వీళ్ళ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు వీరికి ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.